LSG కోసం ఆ సిక్సుల వీరుడు వ‌స్తున్నాడు..ఇక టైటిల్ ప‌క్కా !

by velandi.Saikiran |

లంగర్ స్థానంలో లక్నో ( Lucknow Super Giants ) కోచ్ గా యువరాజ్ సింగ్ కు అవకాశం ఇచ్చేందుకు స్కెచ్ లు

LSG కోసం ఆ సిక్సుల వీరుడు వ‌స్తున్నాడు..ఇక టైటిల్ ప‌క్కా !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే ముందు లక్నో జట్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్ లో చాలా చెత్త ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో ఐపీఎల్ 2026 లో బాగా ప్రదర్శన చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు సిక్సుల‌ వీరుడు యువరాజ్‌ సింగ్ ను బరిలోకి దింపేందుకు లక్నో యాజమాన్యం నిర్ణయం తీసుకుందట.

జస్టిన్ లంగర్ స్థానంలో లక్నో ( Lucknow Super Giants ) కోచ్ గా యువరాజ్ సింగ్ కు అవకాశం ఇచ్చేందుకు స్కెచ్ లు వేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకున్న గిల్, అభిషేక్ శర్మ ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇలాంటి నేపథ్యంలో అతన్ని కోచ్ గా నియామకం చేయాలని లక్నో అనుకుంటుందట. దీని కోసం ప్రత్యేక ప్యాకేజీ కూడా మాట్లాడుతున్నారట. అయితే ఇంకా ఈ ఆఫర్ కు యువరాజు ఓకే చెప్పలేదని సమాచారం. అతడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా డిసెంబర్ 15వ తేదీన ఐపీఎల్ 2026 కు సంబంధించిన మినీ వేలం ముంబైలో జరగనుంది.

Next Story