యువీకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన పంత్.. ‘కొంచెమైనా సిగ్గు పడండి’ అంటూ గిల్, అభిషేక్‌‌‌లను ట్రోల్ చేసిన యువీ

by Harish |

యువీకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన పంత్.. ‘కొంచెమైనా సిగ్గు పడండి’ అంటూ గిల్, అభిషేక్‌‌‌లను ట్రోల్ చేసిన యువీ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2026 ముందు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పర్యవేక్షణలో సన్నద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా పంత్.. యువీకి ఖరీదైన బహుమతి పంపించాడు. ప్రీమియం గోల్ఫ్ క్లబ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. పంత్ ఇచ్చిన బహుమతిని అన్‌బాక్స్ చేస్తున్న వీడియోను యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. గిఫ్ట్‌పై ‘డియర్ యువీ పాజీ.. మీ సపోర్ట్‌కు, గైడెన్స్‌కు ధన్యవాదాలు. గోల్ఫ్ కోర్సులో కలుద్దాం. ప్రేమతో RP’అని రాసి ఉంది. దీంతో పంత్‌కు యువీ ధన్యవాదాలు తెలిపాయి. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నమన్ ధిర్, అబ్దుల్ సమద్, ప్రియాన్ష్ ఆర్య కూడా యువీ శిష్యులే. పంత్ గిఫ్ట్ ఇచ్చిన సందర్భంగా వారిని ఉద్దేశించి యువీ సరదాగా ట్రోల్ చేశాడు. పంత్‌ను చూసి కొంచెమైనా సిగ్గు సిగ్గు పడండి అంటూ కామెంట్ చేశాడు. తాను వారికి కూడా శిక్షణ ఇచ్చినప్పటికీ వారు ఇలాంటి బహుమతి ఇవ్వలేదని యువీ సరదాగా అన్నాడు.


Next Story