- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్‌తో మ్యాచ్.. భారత కెప్టెన్‌గా యువరాజ్ సింగ్
క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా చూసే మ్యాచుల్లో ఇండియా(India), పాకిస్తాన్(Pakistan) మధ్య జరిగే పోరు ఒకటి.

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా చూసే మ్యాచుల్లో ఇండియా(India), పాకిస్తాన్(Pakistan) మధ్య జరిగే పోరు ఒకటి. ఏ పనిలో ఉన్నా.. ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ ఉందంటే చాలు.. క్షణాల్లో టీవీల ముందు వాలిపోతుంటారు. తాజాగా మరోసారి ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(డబ్ల్యూసీఎల్) 2025 శుక్రవారం ప్రారంభం కాబోతోంది. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ తలపడనున్నాయి. బర్మింగ్‌హామ్ మైదానంలో రాత్రి 9 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. జులై 20న ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. బర్మింగ్‌హామ్ మైదానంలో రాత్రి 9 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్‌గా యువరాజ్ సింగ్(Yuvraj Singh) వ్యవహరిస్తున్నాడు. మొత్తం 17 మంది సభ్యులతో కూడిన ఇండియా ఛాంపియన్స్ టీమ్ ఇప్పటికే ఇంగ్లండ్ చేరింది.
జట్టులో సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, వినయ్ కుమార్, అంబటి రాయుడు, నమన్ ఓజా, ఆర్పీ సింగ్ వంటి మాజీ ప్లేయర్స్ జట్టులో ఉన్నారు. 2024లో జరిగిన తొలి ఎడిషన్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. 2025లో మరోసారి ఛాంపియన్‌గా నిలవాలని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.






