- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెమీస్‌లో యుకీ బాంబ్రీ జోడీ ఓటమి
by Harish |
ఏటీపీ మరకేశ్ ఓపెన్ 250 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ ప్లేయర్ యుకీ బాంబ్రీ దూకుడుకు బ్రేక్ పడింది.

X
దిశ, స్పోర్ట్స్ : మొరాకోలో జరుగుతున్న ఏటీపీ మరకేశ్ ఓపెన్ 250 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ ప్లేయర్ యుకీ బాంబ్రీ దూకుడుకు బ్రేక్ పడింది. పురుషుల డబుల్స్‌లో ఫ్రాన్స్ ఆటగాడు అల్బానో ఒలివెట్టితో కలిసి సెమీస్‌కు దూసుకెళ్లిన యుకీ బాంబ్రీకి అక్కడ నిరాశ ఎదురైంది. 2వ సీడ్, ఆస్ట్రియాకు చెందిన లూకాస్ మిడ్లర్-అలెగ్జాండర్ ఎర్లర్ జోడీ చేతిలో 7-5, 3-6, 10-7 తేడాతో యుకీ బాంబ్రీ జోడీ పోరాడి ఓడింది. తొలి సెట్ కోల్పోయిన తర్వాత పుంజుకున్న యుకీ బాంబీ జంట రెండో సెట్ నెగ్గి పోటీలోకి వచ్చింది. అయితే, నిర్ణయాత్మక మూడో సెట్‌లో పోరాడినప్పటికీ ప్రత్యర్థులను నిలువరించలేకపోయింది. ఈ టోర్నీలో భారత సింగిల్స్ స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ రెండో రౌండ్‌లో ఓడి నిష్ర్కమించిన విషయం తెలిసిందే.
Next Story






