- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
US Open: మూడో రౌండ్‌కు యుకీ-మైఖేల్ జోడీ.. కోకో గాఫ్ చిత్తు!
US Open: యుకీ-మైఖేల్ జోడీ యూఎస్ ఓపెన్ మూడో రౌండ్‌కు చేరింది. నవోమీ ఒసాకా చేతిలో కోకో గాఫ్ చిత్తుగా ఓడింది.

దిశ, స్పోర్ట్స్: భారత ప్లేయర్ యుకీ భంబ్రీ, కివీస్ ప్లేయర్ మైఖేల్ వీనస్ జోడీ యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. కొలంబియాకు చెందిన గోంజాలో ఎస్కోబార్, మెక్సికో ప్లేయర్ మిగెల్ ఏంజెల్ రీయస్ వరెలాతో జరిగిన మ్యాచ్‌లో యుకీ-మైఖేల్ జోడీ రెచ్చిపోయింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 6-1తో తొలి సెట్‌ను తమ ఖాతాలో వేసుకున్న ఈ జోడీకి.. రెండో సెట్‌లో కొంత పోటీ ఎదురైంది. కానీ చివరకు దాన్ని కూడా 7-5 తేడాతో నెగ్గిన యుకీ-మైఖేల్.. యూఎస్ ఓపెన్ మూడో రౌండ్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ జానిక్ సిన్నర్ కూడా అదరగొట్టాడు. అలెగ్జాండ్ బుబ్లిక్‌తో జరిగిన మ్యాచులో వరుసగా 6-1, 6-1, 6-1 తేడాతో నెగ్గి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు.
గాఫ్ చిత్తు..
మహిళల సింగిల్స్‌లో జపనీస్ స్టార్ నవోమీ ఒసాకా అదరగొట్టింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకరైన యూఎస్ స్టార్ ప్లేయర్ కోకో గాఫ్‌ను చిత్తుగా ఓడించింది. గాఫ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వని ఒసాకా 6-3, 6-2 తేడాతో వరుస సెట్లు నెగ్గి గేమ్ తన ఖాతాలో వేసుకుంది. అద్భుతమైన సర్వ్‌లతో గాఫ్‌ను ఇబ్బంది పెట్టింది. అదే సమయంలో పేలవంగా ఆడిన గాఫ్.. 33 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.






