రెజ్లర్ల పతకాల పంట.. ఒకే రోజు ఐదు స్వర్ణాలు

by Harish |

అండర్-23 ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ల పతకాల పంట కొనసాగుతోంది.

రెజ్లర్ల పతకాల పంట.. ఒకే రోజు ఐదు స్వర్ణాలు
X

దిశ, స్పోర్ట్స్ : వియత్నంలో జరుగుతున్న అండర్-23 ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ల పతకాల పంట కొనసాగుతోంది. శనివారం ఒకే రోజు ఐదు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. 61 కేజీల కేటగిరీలో నిఖిల్ ఫైనల్‌లో 7-2 తేడాతో మేరీ బజార్‌బయేవ్(కజఖస్తాన్)ను మట్టికరిపించి చాంపియన్‌గా నిలిచాడు. 65 కేజీల కేటగిరీలో సుజీత్ కల్కల్ 10-0తేడాతో ఉమిడ్జోన్ జలోలోవ్(ఉజ్బెకిస్తాన్)పై ఓడించి గోల్డ్ మెడల్ గెలిచాడు. 74 కేజీల కేటగిరీలో జైదీప్ 7-0 తేడాతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జఫర్‌బెక్ ఒటఖోనోవ్‌పై, 79 కేజీల కేటగిరీలో చంద్రమోహన్ 5-2తో తుర్క్‌మోనిస్తాన్ రెజ్లర్ ఆల్ప్ బెజెన్జోవ్‌ను ఓడించి స్వర్ణాలు గెలిచారు. 92 కేజీల కేటగిరీలో సచిన్ 5-2తో డెమ్‌చిగ్‌డోర్జ్ తుముర్‌బాటర్‌ను చిత్తు చేసి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. 125 కేజీల కేటగిరీలో జస్పూరన్ సింగ్ ఫైనల్‌లో ఓడి రజతంతో సరిపెట్టాడు. శనివారం ఆరు పతకాలు దక్కడంతో భారత్ పతకాల సంఖ్య 20కు చేరింది.


Next Story