ఒలింపిక్ మెడలిస్టును ఓడించిన 20 ఏళ్ల భారత కుర్రాడు!

by Phanindra |

ఒలింపిక్ మెడలిస్టును 20 ఏళ్ల భారత కుర్రాడు ఓడించాడు. మలేసియా ఓపెన్ తొలి రౌండ్లో సంచలనం సృష్టించాడు.

ఒలింపిక్ మెడలిస్టును ఓడించిన 20 ఏళ్ల భారత కుర్రాడు!
X

దిశ, స్పోర్ట్స్: మలేసియా ఓపెన్‌లో భారత కుర్రాడు ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ మెడలిస్ట్ లీ జీ జియాను తొలి రౌండ్‌లోనే ఓడించాడీ 20 ఏళ్ల భారతీయుడు. బుకిట్ జలీల్‌లో జరిగిన ఈ సూపర్ 1000 మ్యాచులో అనుభవజ్ఞుడైన లీ జీని 21-12, 21-17తో వరుస సెట్లలో ఓడించిన ఆయుష్.. కేవలం 39 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించడం గమనార్హం. గతేడాది నుంచి అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్న ఆయుష్.. ఈ ఏడాదిని కూడా మెరుగైన ఫలితంతో ప్రారంభించాడు. తన తదుపరి మ్యాచులో చైనా టాప్ సీడ్ షి యూకీతో తలపడనున్నాడు.

చెమటోడ్చిన లక్ష్యసేన్

ఇదే టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే చెమటలు చిందించాడు. సింగపూర్‌కు చెందిన జేసన్ టేతో జరిగిన మ్యాచులో తొలి గేమ్‌ను 21-16తో కైవసం చేసుకున్న సేన్.. రెండో గేమ్‌లో 15-21 తేడాతో ఓడిపోయాడు. మూడో గేమ్‌ను 21-14తో చేజిక్కించుకొని మ్యాచ్ నెగ్గాడు. ప్రపంచ 21వ ర్యాంక్ ప్లేయర్ అయిన జేసన్‌.. భారత టాప్ ప్లేయర్‌ను ఇంతలా ఇబ్బంది పెట్టడం ఫ్యాన్స్‌కు ఆశ్చర్యం కలిగించింది. 70 నిమిషాలపాటు పోరాడిన తర్వాతే జేసన్‌ను లక్ష్యసేన్ ఓడించగలిగాడు. ఇప్పటి వరకు ఐదుసార్లు ఈ ఇద్దరు ప్లేయర్లు తలపడగా.. ఐదుసార్లూ లక్ష్యసేనే విజయం సాధించడం గమనార్హం.

Next Story