ఇంకో ఐదేళ్లు ఆడాల్సింది.. కోహ్లీ, రోహిత్‌పై మండిపడ్డ మాజీ లెజెండ్!

by Phanindra |

కోహ్లీ, రోహిత్ రిటైర్‌మెంట్‌పై యోగ్‌రాజ్ సింగ్ మండిపడ్డాడు. ఇంకో ఐదేళ్లు ఆడాల్సిందని అన్నాడు.

ఇంకో ఐదేళ్లు ఆడాల్సింది.. కోహ్లీ, రోహిత్‌పై మండిపడ్డ మాజీ లెజెండ్!
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ టెస్టు రిటైర్‌మెంట్ ప్రకటించడాన్ని యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ తప్పుబట్టాడు. వీళ్లిద్దరూ మరో ఐదేళ్లు టెస్టు క్రికెట్ ఆడగలిగేవారని యోగ్‌రాజ్ అన్నాడు. ‘విరాట్, రోహిత్ ఇద్దరూ టెస్టుల నుంచి రిటైర్ అవ్వకుండా ఉండాల్సింది. ఉదయం 5 గంటలకు లేచి 20 కిలోమీటర్లు పరిగెత్తితే ఫిట్‌గా అవుతావని రోహిత్‌కు చెప్పా. వాళ్లిద్దరూ మరో ఐదేళ్లు ఆడాల్సింది’ అని ఆయన చెప్పాడు.


వీళ్లిద్దరూ తరువాతి తరానికి సమయం ఇవ్వలేదన్నాడు. ‘కుర్రాళ్ల చేతుల్లోకి జట్టు భవితవ్యం వెళ్తున్నప్పుడు వాళ్లిద్దరూ అక్కడ ఉండాల్సింది. సౌరవ్ గంగూలీ అదే చేశాడు కదా. ఇలా జట్టు భవిష్యత్తును తర్వాతి తరానికి అందివ్వాలి. వీళ్లు అలా చెయ్యలేదు. సడెన్‌గా జట్టు భవిష్యత్తును గిల్ మీద విసిరేశారు’ అని యోగ్‌రాజ్ మండిపడ్డాడు. తన కొడుకు యువరాజ్ సింగ్ కూడా తొందరపడి రిటైర్‌మెంట్ తీసుకున్నాడని పేర్కొన్నాడు.

Next Story