- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCB కి అంత సీన్ లేదు... ఫైనల్ పై యువరాజ్ తండ్రి సంచలన కామెంట్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) ఫైనల్ నేపథ్యంలో యువరాజు సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ (Yog Raj

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) ఫైనల్ నేపథ్యంలో యువరాజు సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ (Yog Raj Singh) సంచలన ప్రకటన చేశాడు. ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తుందని బాంబు పేల్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో... యోగ్ రాజ్ సింగ్ జోష్యం చెప్పాడు.
పంజాబ్ కింగ్స్ ( Punjab Kings) ముందు బెంగళూరు ( RCB) ఎత్తులు పనిచేయబోవని... పేర్కొన్నారు. కానీ.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli) త్వరగా అవుట్ చేయాలని... లేకపోతే ప్రమాదకరంగా మ్యాచ్ మారుతుందని హెచ్చరించాడు. 250 కి పైగా పరుగుల లక్ష్యాన్ని కూడా విరాట్ కోహ్లీ చేజ్ చేస్తాడని గుర్తు చేశారు.
అందుకే 10 ఓవర్స్ లోపు విరాట్ కోహ్లీని అవుట్ చేయాలని.. పంజాబ్ బౌలర్లకు సూచనలు చేశారు యోగ్ రాజ్ సింగ్. అయితే యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ చేసిన కామెంట్స్ పైన బెంగళూరు అభిమానులు.. ఫైర్ అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ... టైటిల్ కలుస్తామని బెంగళూరు అభిమానులు పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉండగా... ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.






