రనౌట్‌పై స్పందించిన జైశ్వాల్.. మ్యాచ్ అనంతరం కీలక వ్యాఖ్యలు

by Harish |

విండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు.

రనౌట్‌పై స్పందించిన జైశ్వాల్.. మ్యాచ్ అనంతరం కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : విండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. రనౌట్ రూపంలో అవుటవడంతో ద్విశతకాన్ని అందుకోలేకపోయాడు. జైడెన్ సీల్స్ వేసిన ఓవర్‌లో రెండో బంతిని జైశ్వాల్ మిడాఫ్ దిశగా ఆడగా బంతి నేరుగా చందర్‌పాల్ వద్దకు వెళ్లింది. అప్పటికే జైశ్వాల్ పిచ్ మధ్యలో వరకు పరుగెత్తగా.. గిల్ రన్‌కు రాలేదు. తిరిగి క్రీజులోకి వెళ్లేలోపే వికెట్ కీపర్ ఇమ్లాచ్ వికెట్లను గిరాటేశాడు. దీంతో జైశ్వాల్ 175 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. తీవ్ర నిరాశకు గురైన అతను తలను చేతితో కొట్టుకున్నాడు. గిల్‌పై అసహనం వ్యక్తం చేశాడు.

అయితే, మ్యాచ్ అనంతరం రనౌట్‌పై జైశ్వాల్ స్పందించాడు. మ్యాచ్‌లో అవన్నీ భాగమేనంటూ వ్యాఖ్యానించాడు. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ‘నేనెప్పుడూ ఎక్కువసేపు ఆడాలని ప్రయత్నిస్తాను. రనౌట్ అనేది ఆటలో భాగం. దాన్ని పట్టించుకోను. ఆరంభంలో నేను ఓ గంట బ్యాటింగ్ చేస్తే ఆ తర్వాత పరుగులు సులభంగా వస్తాయని ఆలోచించా. నేను ఏం సాధించగలను. నా లక్ష్యం ఏంటి.. జట్టు లక్ష్యాలు ఏంటి అనే విషయాలపై ఎప్పుడూ ఆలోచిస్తాను. కానీ, వర్తమానంలో ఉండటం చాలా ముఖ్యం.’అని జైశ్వాల్ చెప్పుకొచ్చాడు.


Next Story