- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC rankings : టాప్-5లోకి దూసుకొచ్చిన జైశ్వాల్
టెస్టుల్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ భారత్ తరపున టాప్ ర్యాంకర్‌గా కొనసాగుతున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : టెస్టుల్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ భారత్ తరపున టాప్ ర్యాంకర్‌గా కొనసాగుతున్నాడు. ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో జైశ్వాల్ టాప్-5లోకి అడుగుపెట్టాడు. రెండు స్థానాలు ఎగబాకిన అతను 5వ ర్యాంక్‌లో నిలిచాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో జైశ్వాల్ సత్తాచాటిన విషయం తెలిసిందే. 219 పరుగుల అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 8వ స్థానంలో, కెప్టెన్ గిల్ 13 స్థానాలను కాపాడుకున్నారు. ఇక, స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నం.1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. స్పిన్నర్ కుల్దీప్ 7 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం 14వ స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాణించడంతో అతని ర్యాంక్ మెరుగుపడింది. 12 వికెట్లు తీసిన అతను టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడంతో జడేజా టాప్ పొజిషన్‌కు ఇప్పట్లో ఢోకా లేదు.
ప్రమాదంలో గిల్ అగ్రస్థానం
వన్డే ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ ప్లేయర్లు సత్తాచాటారు. బంగ్లాపై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన నేపథ్యంలో ఆ జట్లు ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. స్పిన్నర్ రషీద్ ఖాన్ వన్డేల్లో తిరిగి నం.1 బౌలర్‌గా అవతరించాడు. ఐదు స్థానాలు ఎగబాకిన అతను సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నం.1 ఆల్‌రౌండర్‌గా అవతరించాడు. వన్డే సిరీస్‌లో 7 వికెట్లు తీసిన అతను ఒక్క స్థానం మెరుగుపర్చుకుని టాప్ పొజిషన్‌ను సాధించాడు. ఇక, బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ కూడా ాప్ ర్యాంక్‌కు చేరువయ్యాడు. సిరీస్‌లో అతను 213 రన్స్ చేశాడు. ఈ నేపథ్యంలోనే అతను 8 స్థానాలు మెరుగుపర్చుకుని 2వ స్థానానికి చేరుకున్నాడు.ప్రస్తుతం నం.1 బ్యాటర్‌గా ఉన్న టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొనసాగుతుండగా అతని అగ్రస్థానం ప్రమాదం పడింది. గిల్‌కు అజ్మతుల్లా కేవలం 20 రేటింగ్ పాయింట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. కాబట్టి, టాప్ పొజిషన్ కాపాడుకోవాలంటే ఆసిస్‌తో వన్డే సిరీస్‌లో గిల్ రాణించాల్సిన అవసరం ఉంది.






