- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WWE రెసిల్ మేనియాలో సంచలనం.. బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్
WWE లెజెండ్ బ్రాక్ లెస్నర్ రెసిల్ మేనియా 42లో ఓబా ఫెమీ చేతిలో ఓడిపోయిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఆయన సుదీర్ఘ కెరీర్ ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: WWE రెసిల్ మేనియాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ చరిత్రలో అత్యంత శక్తివంతమైన రెజ్లర్‌గా పేరుగాంచిన బ్రాక్ లెస్నర్ (Brock Lesnar) రిటైర్మెంట్ (Retirement) తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రెసిల్ మేనియా ౪౨ (WrestleMania 42)లో భాగంగా జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన పోరులో నైజీరియాకు చెందిన వర్ధమాన రెజ్లర్ ఓబా ఫెమీ (Wrestler Oba Femi) చేతిలో లెస్నర్ ఓటమి పాలయ్యారు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన రెజ్లింగ్ బూట్లను రింగ్‌లోనే వదిలి వెళ్లడం ద్వారా తాను రిటైర్ అవుతున్నట్లు లెస్నర్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీనిని తర్వాత అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
ఒకవైపు అపార అనుభవం ఉన్న లెస్నర్, మరోవైపు అద్భుతమైన శారీరక దారుఢ్యం ఉన్న యువ రెజ్లర్ ఓబా ఫెమీ మధ్య జరిగిన ఈ పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. మ్యాచ్ చివరిలో ఓబా ఫెమీ తన సిగ్నేచర్ మూవ్స్‌తో లెస్నర్‌ను కట్టడి చేసి విజయం సాధించారు. లెస్నర్ వంటి దిగ్గజం ఇంతటి కీలక వేదికపై ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బ్రాక్ లెస్నర్ తన కెరీర్‌లో మల్టిపుల్ టైమ్స్ వరల్డ్ ఛాంపియన్‌గా, యూఎఫ్ సీ (UFC) హెవీ వెయిట్ ఛాంపియన్‌గా, రెసిల్ మేనియాలో అండర్ టేకర్ అజేయ పరంపరను (The Streak) ముగించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. లెస్నర్ నిష్క్రమణతో WWEలో ఒక శకం ముగియగా, ఓబా ఫెమీ రూపంలో ఒక కొత్త సూపర్ స్టార్ ఉద్భవించాడని విశ్లేషకులు భావిస్తున్నారు.






