- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టేబుల్ టెన్నిస్‌లో కీలక ఒప్పందం
డబ్ల్యూటీటీకి మాపై నమ్మకం ఉండటం వల్లే అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లను చెన్నైకి తీసుకొని రాగలిగామని స్తూప స్పోర్ట్స్ అనలటిక్స్ వ్యవస్థాపకుడు దీపక్ మాలిక్ అన్నారు.

- స్తూప స్పోర్ట్స్‌తో జత కట్టిన యూటీటీ
- డబ్ల్యూటీటీ స్టార్లు పాల్గొనే అవకాశం
- చెన్నై వేదికగా మార్చి 25 నుంచి ఆరో సీజన్
దిశ, స్పోర్ట్స్: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ), స్తూప స్పోర్ట్స్ అనలిటిక్స్ సంస్థలు కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ రెండు కలిసి చెన్నై వేదికగా జరుగనున్న ఆరో సీజన్‌ను నిర్వహించనున్నట్లు తెలిపాయి. ఈ సారి వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ)కి చెందిన స్టార్ ఆటగాళ్లు యూటీటీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. మార్చి 25 నుంచి 30 వరకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియంలో ఆరో సీజన్ యూటీటీ జరుగనుంది. ఈ సారి విజేతల కోసం 2,75,000 యూఎస్ డాలర్లు ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు. దీంతో పాటు ఐటీటీఎఫ్‌లో 600 ర్యాకింగ్ పాయింట్లు కూడా కలవనున్నాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఇండియాకు వస్తుండటంతో మన అథ్లెట్లకు ఇది మంచి అవకాశంమని నిర్వాహకులు తెలిపారు. అగ్రశ్రేణి క్రీడాకారులతో ఆడటం వల్ల ఎంతో అనుభవం వస్తుందని చెప్పారు. ఇండియాలో టేబుల్ టెన్నిస్‌కు చెన్నై ఎప్పటి నుంచో హబ్‌గా ఉంది. ఆచంట శరత్ కమల్, సాథియన్ జ్ఞానశేఖరన్ వంటి అంతర్జాతీయ క్రీడాకారులు చెన్నైకు చెందిన వారే కావడం గమనార్హం. డబ్ల్యూటీటీకి మాపై నమ్మకం ఉండటం వల్లే అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లను చెన్నైకి తీసుకొని రాగలిగామని స్తూప స్పోర్ట్స్ అనలటిక్స్ వ్యవస్థాపకుడు దీపక్ మాలిక్ అన్నారు. ఇండియన్ టేబుల్ టెన్నిస్‌కు చెన్నై కీలకమైన నగరమని ఆయన అభిప్రాయపడ్డారు.






