- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. తుది జట్లను ప్రకటించిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (World Test Championship) ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (World Test Championship) ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక క్రికెట్ స్టేడియం లార్డ్స్ (Lord's) వేదికగా ఆస్ట్రేలియా (Australia), సౌతాఫ్రికా (South Africa) మధ్య 2023-2025 డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు దేశాలు తమ తుది జట్లను ప్రకటించాయి. ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. మాజీ నంబర్ 1 టెస్ట్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్‌ను ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఓపెనింగ్‌కు ప్రమోట్ చేశారు. పేస్ బౌలింగ్ విభాగం బాధ్యతలను జోష్ హాజిల్‌వుడ్‌తో పాటు స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్, కమిన్స్ తీసుకోనున్నారు. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ బ్యాక్ సర్జరీ తర్వాత మొదటిసారి టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అదేవిధంగా బ్యూ వెబ్‌స్టర్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతడు మీడియం పేస్‌తో పాటు పార్ట్-టైమ్ స్పిన్‌తో అదనపు బౌలింగ్ ఆప్షన్‌గా ఆసిస్‌కు సేవలందించనున్నాడు.
మరోవైపు సౌతాఫ్రికా తెంబా బావుమా (కెప్టెన్), ర్యాన్ రికెల్‌టన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. ఐదెన్ మార్‌క్రమ్, వియాన్ ముల్డర్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెరినేలు మిడిల్ ఆర్డర్ బాధ్యతలను మోయనున్నారు. మార్కో యాన్సెన్, కగిసో రబాడ, లుంగి ఎంగిడిలు పేస్ అటాక్ చేయనున్నారు. ఇక కేశవ్ మహరాజ్ మహారాజ్ స్పిన్ బాధ్యతలు తీసుకోనున్నాడు.
3.6 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ..
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు బంగారు గదతో పాటు 3.6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.30.80 కోట్లు) ప్రైజ్‌మనీని దక్కనుంది. 2023తో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా ఎక్కువే. గత ఛాంపియన్ ఆస్ట్రేలియా 1.6 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని అందుకుంది. ఈ సారి రన్నరప్‌గా నిలిచే జట్టు 2.1 మిలియన్ డాలర్లు (రూ.17.94 కోట్లు) సొంతం చేసుకుంది. అయితే, గత ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా భారత్‌కు 8 లక్షల డాలర్లు మాత్రమే వచ్చాయి.
ఆస్ట్రేలియా జట్టు: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కెరీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, జోష్ హేజిల్‌వుడ్.
సౌతాఫ్రికా జట్టు: తెంబా బావుమా (కెప్టెన్), ఐదెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికెల్‌టన్, వియాన్ ముల్డర్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెరినే, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.






