WTC ఫైనల్.. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా ఆల్ ఔట్

by Muthe.Rajitha |

ఆస్ట్రేలియాతో జరుగుతున్న WTC ఫైనల్ లో సౌతాఫ్రికా(South Africa vs Austrelia) తొలి ఇన్నింగ్స్ లో 138 పరుగులకు ఆల్ ఔట్ అయింది.

WTC ఫైనల్.. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా ఆల్ ఔట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న WTC ఫైనల్ లో సౌతాఫ్రికా(South Africa vs Austrelia) తొలి ఇన్నింగ్స్ లో 138 పరుగులకు ఆల్ ఔట్ అయింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగులకు ఆల్ ఔట్ అయిన విషయం తెలిసిందే. అయితే స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో సౌతాఫ్రికా తడబడింది. రెండో రోజు 43/4 తో ఆట మొదలవగా.. దక్షిణాఫ్రికా భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. కాని 125/5 వద్ద పాట్ కమిన్స్(Pat Cummins) 13 పరుగులిచ్చి మిగిలిన 5 వికెట్లు తీసి సఫారీలను చావు దెబ్బ కొట్టాడు. బెండింగ్ హమ్(45), బావుమా(36) పరుగులతో మంచి స్కోర్ చేశారు. ఇక పాట్ కమిన్స్ 6 వికెట్లు తీసి సత్తా చాటాడు.

Next Story