WTC ఫైనల్.. ఆసీస్ ఆల్ ఔట్

by Muthe.Rajitha |   (  Updated:2025-06-11 15:39:07  IST  )

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్ లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా(South Africa vs Austrelia) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

WTC ఫైనల్.. ఆసీస్ ఆల్ ఔట్
X

దిశ, వెబ్ డెస్క్ : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్ లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా(South Africa vs Austrelia) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 212 పరుగులకు ఆల్ ఔట్ అయింది. 190/5 స్కోర్ తో మూడో సెషన్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా.. 22 పరుగులకు చివరి ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం. బ్యూ వెబ్ స్టర్(72), స్టీవ్ స్మిత్(66) మాత్రమే రాణించగా.. అలెక్స్ కెరీ(23), లబుషేన్(17), ట్రావీస్ హెడ్(10) పరుగులు మాత్రమే చేశారు.

గ్రీన్(4), కమిన్స్(1), ఖవాజ(0) పరుగులతో దారుణంగా విఫలం అయ్యారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ(Rabada) కీలక 5/55 వికెట్లు తీసి సత్తా చాటాడు. యాన్సెస్ 3, మహరాజ్, మార్క్రం చెరో వికెట్ తీశారు.

Next Story