- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WTC Final: ఓటమి అంచున ఆసిస్.. కమిన్స్ కెప్టెన్సీపై మాజీలు ఫైర్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship)లో భాగంగా లార్డ్స్ (Lords) వేదికగా సౌతాఫ్రికా (South Africa)తో జరుగుతున్న ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia) ఓటమి అంచున నిలిచింది.

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship)లో భాగంగా లార్డ్స్ (Lords) వేదికగా సౌతాఫ్రికా (South Africa)తో జరుగుతున్న ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia) ఓటమి అంచున నిలిచింది. 282 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసింది. మార్క్‌రమ్ (159 బంతుల్లో 11 ఫోర్లతో 102) సెంచరీతో రాణించగా.. టెంబా బవుమా(121 బంతుల్లో 5 ఫోర్లతో 65 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇద్దరూ ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. మరో 69 పరుగులో చేస్తే సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ సొంతం చేసుకోనుంది. ఈ క్రమంలోనే ప్యాట్ కమిన్స్ (Pat Cummins) కెప్టెన్సీపై ఆసిస్, సౌతాఫ్రికా మాజీ ప్లేయర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
డెయిల్ స్టెయిన్ (Dale Stein), మాథ్యూ హెడెన్ (Matthew Hayden) మాట్లాడుతూ.. కమిన్స్ ముఖ్యంగా పరుగులు అడ్డుకునేందుకు మాత్రమే ఫిల్డ్ సెట్ చేశాడని కామెంట్ చేశాడు. వికెట్లు తీసేందుకు ఎక్కడా అటాకింగ్ ఫిల్డ్ సెట్ చేయలేదని అన్నారు. ర్యాన్ రికెల్టన్, మల్డర్‌లను ఔట్ అవ్వగానే బవుమాపై ఒత్తిడి తీసుకొచ్చేలా బౌలింగ్ చేయాల్సిందని తెలిపారు. ఆసీస్ బౌలింగ్ విభాగంలో మునుపటి కాన్ఫిడెన్స్ లేదని.. డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్‌లో గెలవాలంటే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయడం తప్పనిసరి అని మాథ్యూ హెడెన్ అన్నారు. ఆసిస్ ప్లేయర్ల ఫీల్టింగ్ పొజిషన్లు చూసి తనను ఆశ్చర్యానికి గురి చేసిందని డెయిల్ స్టెయిన్ తెలిపాడు.






