WTC FINAL 2023 : భారత్‌కు బిగ్ షాక్

by Sathputhe Rajesh |

ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ముందు భారత జట్టు బిగ్ షాక్ తగిలింది.

WTC FINAL 2023 : భారత్‌కు బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ముందు భారత జట్టు బిగ్ షాక్ తగిలింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆడే ఇండియన్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్, జైదేవ్ ఉనద్కత్ గాయపడ్డారు. బెంగళూరుతో మ్యాచ్ లో డుప్లెసిస్ షాట్ ను అడ్డుకునే క్రమంలో రాహుల్ కుడి తొడకు గాయమైంది. అంతకు మందు నెట్ ప్రాక్టీస్ లో ఉనద్కత్ ఎడమ భుజానికి గాయమైంది. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లకు అయిన గాయాలు తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక వేళ గాయాలతో వీళ్లిద్దరూ జూన్ 7న ఓవల్ లో ఆరంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్ కు దూరమైతే యశస్వి జైస్వాల్, అర్ష్ దీప్ సింగ్ లకు జట్టులో చోటిచ్చే ఛాన్స్ ఉంది. జైస్వాల్ ని పక్కనబెడితే ఇషాన్ కిషన్, అభిమన్యు ఈశ్వరన్ లలో ఒకరికి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది.

Next Story