WTC Final 2023: చేతులెత్తేసిన భారత బౌలర్లు.. ఆసీస్ భారీ స్కోరు

by Vinod kumar |

ఓవల్ వేదికగా జరుగుతున్న WTC Final 2023లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది.

WTC Final 2023: చేతులెత్తేసిన భారత బౌలర్లు.. ఆసీస్ భారీ స్కోరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓవల్ వేదికగా జరుగుతున్న WTC Final 2023లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా.. ట్రావిస్ హెడ్ 106 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సెంచరీ చేయగా.. స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ దిశగా సాగుతున్నాడు. ట్రావిస్ హెడ్‌కి ఇది ఆరో టెస్టు సెంచరీ కాగా విదేశాల్లో మొట్టమొదటిది. టీమిండియాపై కూడా ట్రావిస్ హెడ్‌కి ఇదే మొదటి సెంచరీ. 65 ఓవర్లు ముగిసే సమయానికి ఈ ఇద్దరూ 249 బంతుల్లో 162 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ (146), స్మిత్ (95) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి ఆసీస్ 327 రన్స్ చేసింది.

Next Story