- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WPL : RCB తొలి విజయం
WPL 2026 సీజన్ తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది.

దిశ, వెబ్ డెస్క్ : WPL 2026 సీజన్ తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ముంబై ఇండియన్స్ (MI)పై విజయం సాధించింది. నేడు నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన RCB బౌలింగ్ ఎంచుకోగా.. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. 155 పరుగుల లక్ష్యంతో ఛేజ్‌కు దిగిన RCB చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో గెలిచింది.
నదైన్ డి క్లార్క్ 44 బంతుల్లో 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచి చివరి ఓవర్‌లో వరుసగా భారీ షాట్లు కొట్టి మ్యాచ్‌ను RCB వైపు తిప్పింది. దీంతో ఆమెకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. గ్రేస్ హారిస్ 25, అరుంధతి రెడ్డి 20, స్మృతి మంధాన 18 పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో అమెలియా కెర్, నికోలా కారీ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో RCB తొలి బోణీ కొట్టగా.. అభిమానులు పండగ చేసుకుంటున్నారు.






