WPL 2026: ప్రేక్షకులు లేకుండానే WPL మ్యాచ్‌లు

by velandi.Saikiran |

జనవరి 14, 15,16 తేదీలలో ప్రేక్షకులు లేకుండానే ఈ WPL మ్యాచ్ లు నిర్వహించబోతున్నారట.

WPL 2026: ప్రేక్షకులు లేకుండానే WPL మ్యాచ్‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: క్రికెట్ అభిమానులకు అలర్ట్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ( Women's Premier League 2026) టోర్నమెంట్ నేపథ్యంలో కీలక ప్రకటన బీసీసీఐ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు లేకుండానే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మ్యాచ్ లు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ టోర్నమెంట్ మొత్తం కాకుండా జనవరి 14, 15,16 తేదీలలో ప్రేక్షకులు లేకుండానే ఈ WPL మ్యాచ్ లు నిర్వహించబోతున్నారట.

జనవరి 15వ తేదీన ముంబైలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లకు భద్రత కల్పించలేమని ఇప్పటికే ముంబై పోలీసులు తేల్చారట. బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. అందుకే ఈ పైన పేర్కొన్న మూడు రోజుల్లో ప్రేక్షకులు లేకుండానే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మ్యాచ్ లు జరగనున్నాయట.

Next Story