నేటి నుంచి డబ్ల్యూపీఎల్ - 2026

by Muthe.Rajitha |

తొలి మ్యాచ్‌ ముంబయి vs బెంగళూరు

నేటి నుంచి డబ్ల్యూపీఎల్ - 2026
X

దిశ, వెబ్ డెస్క్ : నేటి నుంచి టాటా డబ్ల్యూపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. WPL 2026లో మొత్తం 5 జట్లు పాల్గొంటున్నాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మరియు గుజరాత్ జెయింట్స్. కాగా ఈ సీజన్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో 20 లీగ్ మ్యాచ్‌లు ఉండగా ప్రతి జట్టు మిగతా జట్లతో రెండుసార్లు తలపడుతుంది. అనంతరం ఎలిమినేటర్, ఫైనల్ లో రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లతో ఈ టోర్నమెంట్ ముగుస్తుంది. ఈ సీజన్ మ్యాచ్‌లు నవీ ముంబై, వడోదరా వేదికల్లో జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు బరిలో దిగనున్నాయి.

ఈ మ్యాచ్ నేడు రాత్రి 7:30 గంటల నుంచి నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన 3 సీజన్స్ లో రెండుసార్లు ముంబై జట్టు కప్పు సొంతం చేసుకోగా, ఒకసారి బెంగుళూరు జట్టు సొంతం చేసుకుంది. కాగా నేడు ఈ రెండు మాజీ ఛాంపియన్ జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ మూడో టైటిల్ కోసం పోరాడుతుండగా, స్మృతి మంధాన నాయకత్వంలో ఆర్‌సీబీ రెండో టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story