- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCBకి మరో టైటిల్...విరాట్ కోహ్లీ షాకింగ్ పోస్ట్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన బెంగళూరుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు విరాట్ కోహ్లీ.

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజేతగా బెంగళూరు నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ మహిళల జట్టును ఓడించి రెండోసారి టైటిల్ గెల్చుకుంది బెంగళూరు. దీంతో బెంగళూరులో సంబరాలు అంబరాన్ని అంటాయి. రెండోసారి టైటిల్ గెలిచిన బెంగళూరు జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
బెంగళూరు విజయం పై విరాట్ కోహ్లీ రియాక్ట్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన బెంగళూరుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు విరాట్ కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెండాను మరింత ఎత్తుకు ఎగురవేస్తూ అందరిని గర్వపడేలా చేస్తున్నారని స్మృతి మందాన జట్టుకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు కోహ్లీ. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మొత్తం ఉత్తమ ప్రదర్శన చేసి విజయం సాధించారని, ఇలాగే ముందుకు దూసుకు వెళ్లాలని కోరారు.
అటు బెంగళూరు జట్టుపై ( RCB) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సారి కూడా కప్పు మనదే అంటూ అటు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇది ఇలా ఉండగా, నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. దీంతో ఈ టోర్నమెంట్ లో రెండోసారి ఛాంపియన్ గా నిలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది బెంగళూరు. అటు ఢిల్లీ పోరాడి ఓడింది. దీంతో రన్నరప్ గా నిలిచింది.






