'ఈ సాలా కప్ నమ్దే!' 2 అంటూ స్మృతి మందాన కామెంట్స్‌

by velandi.Saikiran |   (  Updated:2026-02-06 11:10:28  IST  )

మహిళల ప్రీమియర్ లీ 2026 టోర్నమెంట్ విజేతగా బెంగళూరు నిలిచిన నేపథ్యంలో కెప్టెన్ స్మృతి మందాన ( CAPTAIN SMRITI MANDHANA) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సాలా కప్ నమ్దే! 2 అంటూ స్మృతి మందాన కామెంట్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( WPL 2026 Final) విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) నిలిచిన సంగతి తెలిసిందే. అందరూ ఊహించినట్లుగానే ఈ టోర్నమెంట్ మొదటి నుంచి చివరి వరకు బెంగళూరు తన దూకుడును కొనసాగించింది. దానికి తగ్గట్టుగానే ( WPL 2026 Final) ఫైనల్స్ లో విజయం సాధించిన బెంగళూరు జట్టు, రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. మహిళల ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో బెంగుళూరు విజయం సాధించింది. ఈ సందర్భంగా తన జట్టు విజయంపై కెప్టెన్ స్మృతి మందాన స్పందించారు.

రెండోసారి ఛాంపియన్ కావడంపై స్మృతి మందాన కామెంట్స్

మహిళల ప్రీమియర్ లీ 2026 టోర్నమెంట్ విజేతగా బెంగళూరు నిలిచిన నేపథ్యంలో కెప్టెన్ స్మృతి మందాన ( CAPTAIN SMRITI MANDHANA) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు 'ఈ సాలా కప్ నమ్దే!' అన్నారు.. ఇక నుంచి 'ఈ సాలా కప్ నమ్దే!' 2 అంటూ అనాల్సిందేనని స్మృతి మందాన స్పష్టం చేశారు. ఈ టోర్నమెంట్ లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగినట్లు వెల్లడించారు స్మృతి మందాన. పట్టు వదలకుండా ఈ టోర్నమెంట్లో ముందుకు సాగినట్లు తెలిపారు. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ తరుణంలోనే రెండోసారి ఛాంపియన్ అయినట్లు కెప్టెన్ స్మృతి మందాన వెల్లడించారు.

ఢిల్లీని చిత్తుగా ఓడించిన బెంగళూరు

మహిళల ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Royal Challengers Bangalore), ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals) మహిళల జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా రానించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మొట్ట మొదటగా బ్యాటింగ్ కు దిగింది. దానికి తగ్గట్టుగానే భారీ స్కోరు సాధించింది ఢిల్లీ. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన ఢిల్లీ మహిళల జట్టు, నాలుగు వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు అవలీలగా ఛేదించింది.

19.4 ఓవర్లు ఆడిన బెంగళూరు మహిళల జట్టు, 203 పరుగుల లక్ష్యాన్ని చేదించింది. ఈ విజయం సాధించిన నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఈ విజ‌య‌తో రెండోసారి టైటిల్ సొంతం చేసుకున్న బెంగ‌ళూరు జ‌ట్టులో సంబ‌రాలు అంబ‌రాన్ని అంటుకున్నాయి. అటు ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు మ‌రోసారి ఫైన‌ల్స్ లో దారుణంగా ఓడిపోయింది. అటు 2023 ఏడాది టోర్న‌మెంట్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ దారుణంగా ఓడిపోతూ వ‌స్తోంది. ప్ర‌తీ ఫైన‌ల్ లోనూ ఓడిపోయింది. క్లిక్

RCBకి మ‌రో టైటిల్...విరాట్ కోహ్లీ షాకింగ్ పోస్ట్‌

Next Story