- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WPL 2026 Opening Ceremony : లుంగి డ్యాన్స్.. లుంగి డ్యాన్స్.. డీవై పాటిల్ స్టేడియాన్ని హోరెత్తించిన హనీ సింగ్

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ గ్రాండ్‌గా మొదలైంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ జరిగింది. ముందుగా 2021 మిస్ యూనివర్స్, నటి హర్నాజ్ కౌర్ సందూ మహిళలను ఉద్దేశించి సందేశం ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన నృత్యంతో అలరించింది. పలు పాటలకు స్టెప్పులు వేసింది. అనంతరం సింగర్ యో యో హనీ సింగ్ ఎంట్రీతో స్టేడియం మొత్తం హోరెత్తింది. మిలినీయర్ సాంగ్‌తో మొదలుపెట్టిన అతను బ్లూ ఐస్, లుంగి డ్యాన్స్, పార్టీ ఆల్ నైట్ వంటి పాపులర్ సాంగ్స్ పాడాడు. అతను పాడుతుంటే ప్రేక్షకులు కేకేలు వేశారు. దీంతో స్టేడియం మారుమోగింది. హనీ సింగ్ స్టేడియం మొత్తం తిరుగుతూ పాడాడు. దీంతో అభిమానులే కాదు ఎంఐ, ఆర్సీబీ ప్లేయర్లు కూడా స్టెప్పులు వేశారు. ఓపెనింగ్ సెర్మనీ కంటే ముందే టాస్ వేయగా ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ముందుగా బ్యాటింగ్ దిగగా.. పవర్ ప్లేలో ఒక్క వికెట్ కోల్పోయి 34 రన్స్ చేసింది.
Grooving to the tunes 🎶
— Women's Premier League (WPL) (@wplt20) January 9, 2026
The energetic Honey Singh lights up the #TATAWPL opening ceremony in style 🔥#MIvRCB | #KhelEmotionKa | @asliyoyo pic.twitter.com/3C0sYtNrMr






