- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL 2026: నేడే మెగా వేలం..ఈ ప్లేయర్లపై కన్ను
( WPL 2026 auction ) సంబంధించిన మెగా వేలానికి రంగం సిద్ధమైంది. ఇవాళ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం ఢిల్లీలో

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( WPL 2026 auction ) సంబంధించిన మెగా వేలానికి రంగం సిద్ధమైంది. ఇవాళ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ వేలంలో 73 ఖాళీల కోసం మొత్తం 277 మంది మహిళా క్రికెటర్లు బరిలో ఉండనున్నారు. అంతేకాదు ఇందులో మొత్తం 194 మంది భారత ప్లేయర్లు ఉండడం గమనార్హం. ముఖ్యంగా మొన్న జరిగిన వన్డే వరల్డ్ కప్ 2025లో రాణించిన మహిళా క్రికెటర్లపై 5 ఫ్రాంచైజీలు కన్నేసినట్లు తెలుస్తోంది. ఆ వరల్డ్ కప్ లో బాగా రాణించిన ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించబోతున్నాయి.
అలా చూసుకున్నట్లయితే టీమిండియా మహిళా క్రికెటర్లు దీప్తి శర్మ, రేణుక, శ్రీ చరణ్, ప్రతిక రావల్, హర్లీన్ డియోల్ లాంటి ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు 5 ఫ్రాంచైజీలు పోటీపడే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు విదేశాలకు చెందిన అలీషా హీలి , మెగ్ లానింగ్ , ఎకిల్ స్టోన్ , అమీలియా కెర్ , సోఫీ డివైన్, వాల్ వర్ట్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు కలిసి 41.1 కోట్లు ఖర్చు చేయబోతున్నాయి.
ఇందులో అత్యధికంగా యూపీ వారియర్స్ దగ్గర 14.5 కోట్లు ఉన్నాయి. కాబట్టి యూపీ వారియర్స్ మంచి ప్లేయర్లను కొనుగోలు చేసుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర అతి తక్కువ మొత్తం 5.70 కోట్లు ఉన్నాయి. గుజరాత్ జెయింట్స్ వద్ద తొమ్మిది కోట్లు ఉండగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దగ్గర 6.15 కోట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ దగ్గర 5.75 కోట్లు ఉన్నాయి. ఇక ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం మధ్యాహ్నం మూడున్నర గంటలకు జరగనుంది. ఈ మెగా వేలం ప్రసారాలు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ లో రానున్నాయి.






