- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL 2025 : యూపీ వారియర్స్ కెప్టెన్‌గా దీప్తి శర్మ
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)-2025లో యూపీ వారియర్స్ కెప్టెన్‌గా భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ నియామకమైంది.

దిశ, స్పోర్ట్స్ : మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)-2025లో యూపీ వారియర్స్ కెప్టెన్‌గా భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ నియామకమైంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ఆదివారం వెల్లడించింది. గత సీజన్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న దీప్తికి ఫ్రాంచైజీ ప్రమోషన్ ఇచ్చింది. గత రెండు సీజన్లలో జట్టును నడిపించిన అలీసా హీలీ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైంది. ఈ క్రమంలో దీప్తికి సారథ్య బాధ్యతలు దక్కాయి. దీంతో డబ్ల్యూపీఎల్‌లో ఓ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న 4వ భారత క్రికెటర్‌గా దీప్తి నిలిచింది. స్మృతి మంధాన(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), హర్మన్‌ప్రీత్ కౌర్(ముంబై ఇండియన్స్) కెప్టెన్లుగా ఉండగా.. తొలి సీజన్‌లో గుజరాత్ జెయింట్స్‌ను స్నేహ్ రాణా నడిపించింది. తొలి సీజన్ 2023లో దీప్తిని యూపీ రూ.2.6 కోట్లుకు కొనుగోలు చేసింది. 2023లో 90 రన్స్, 9 వికెట్లు తీసిన ఆమె.. గతేడాది అద్భుతంగా రాణించింది. 295 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన 5వ బ్యాటర్‌గా నిలిచింది. అలాగే, 10 వికెట్లు కూడా తీసింది. ఈ నెల 14 నుంచి టోర్నీ ప్రారంభంకానుంది. ఈ నెల 16న యూపీ తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది.






