- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు డబ్ల్యూపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ముంబై, ఢిల్లీ ఢీ.. శుభారంభం ఎవరిదో?
డబ్ల్యూపీఎల్‌లో ఓపెనింగ్ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు సిద్ధమయ్యాయి.

దిశ, స్పోర్ట్స్ : డబ్ల్యూపీఎల్‌లో ఓపెనింగ్ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు సిద్ధమయ్యాయి. నేడు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. టోర్నీలో శుభారంభమే లక్ష్యంగా ఈ రెండు జట్లు బరిలోకి దిగబోతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై.. ఢిల్లీపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటుంది. ఇప్పటివరకు మూడు సార్లు ఇరు జట్లు ఎదురుపడగా రెండుసార్లు ముంబై గెలిచింది. మరో మ్యాచ్‌లో ఢిల్లీ నెగ్గింది. గత సీజన్ ఫైనల్‌లో ఢిల్లీపై ముంబై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఓటమికి ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ మ్యాచ్‌లోనే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా, అమన్‌జోత్ కౌర్‌లతోపాటు అమేలియా కెర్, నాట్ స్కివర్ బ్రంట్, పూజ వస్త్రాకర్ వంటి ఆల్‌రౌండర్లతో ముంబై పేపర్‌పై బలంగా కనిపిస్తుంది. పేస్ దళంలో షబ్నమ్ ఇస్మాయిల్, ఇసీ వాంగ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మరోవైపు, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లతోపాటు మరిజేన్ కాప్, మెగ్ లానింగ్, సదర్లాండ్, జెస్ జొనాసెన్‌లో ఢిల్లీ జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తుంది. మరి, టోర్నీని ఏ జట్టు విజయంతో ఆరంభిస్తుందో చూడాలి.






