- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WTC: ఆస్ట్రేలియా ఆలౌట్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
లండన్‌లోని లార్డ్స్(Lord's) మైదానం వేదికగా జరుగుతోన్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్(World Test Championship) ఫైనల్లో ఆస్ట్రేలియా(Australia) జట్టు ఆలౌట్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: లండన్‌లోని లార్డ్స్(Lord's) మైదానం వేదికగా జరుగుతోన్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్(World Test Championship) ఫైనల్లో ఆస్ట్రేలియా(Australia) జట్టు ఆలౌట్ అయింది. తొలి ఇన్సింగ్స్‌లో 212 పరుగులు చేసి ఆలౌట్ అయిన ఆసిస్, రెండో ఇన్సింగ్స్‌లో 207 పరుగులు చేసింది. మొత్తంగా సౌతాఫ్రికా(South Africa) ఎదుట 282 పరుగుల టార్గెట్ పెట్టింది. ఆసిస్ బ్యాటర్లలో లబుషేన్ (22), క్యారీ(43), స్టార్క్(58)తో రాణించగా మిగిలిన బ్యాటర్లంతా విఫలం అయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా నాలుగు వికెట్లు, లుంగి ఎంగిడి మూడు వికెట్లు, జాన్సన్, వల్డర్, మార్కరమ్ తలో వికెట్ తీశారు. ఆసిస్ నిర్ధేశించిన 282 పరుగులను సౌతాఫ్రికా ఛేదించి విశ్వవిజేతగా నిలవాలని ఆసిస్ మినహా మిగతా అన్ని దేశాల అభిమానులు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. లార్డ్స్‌లోని ప్రతిష్టాత్మక క్రికెట్ మైదానంలో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు మానవత్వాన్ని చాటుకున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకు రెండు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు. ఆట ప్రారంభానికి ముందు ఒక నిమిషం మౌనం పాటించి మృతులకు సంతాపం తెలిపారు.






