- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఫేవరెట్, వరల్డ్ నం.1 క్రీడాకారిణి సబలెంక ఇంటిదారిపట్టింది. కోకో గాఫ్, ఇగా స్వైటెక్ ఓడిపోవడంతో సబలెంకకు ఇక పోటీ లేదనుకున్న తరుణంలో ఆమెకు కూడా షాక్ తప్పలేదు. క్వార్టర్ ఫైనల్‌లో రష్యాకు చెందిన డయానా ష్నైడర్ చేతిలో కంగుతింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సబలెంకపై ష్నైడర్ 3-6, 7-5, 6-0 తేడాతో విజయం సాధించింది. మొదట సబలెంకదే జోరు. ర్యాంకింగ్ పరంగా తన కంటే చాలా వెనుకబడి ఉన్న ప్రత్యర్థిపై ఆమె దూకుడు ప్రదర్శించింది. తొలి సెట్ గెలిచింది. సబలెంక విజయం సులభమే అనుకున్న స్థితిలో ఆమె అనూహ్యంగా తడబడింది. ఆమె తప్పులను సద్వినియోగం చేసుకున్న ష్నైడర్ దూకుడు పెంచింది.
వరుసగా 2, 3 సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా 3వ సెట్‌లో పూర్తి హవా ఆమెదే. సబలెంక ఒక్క గేము కూడా గెలవకపోవడం గమనార్హం. సబలెంక 57 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ష్నైడర్ కేవలం 25 పొరపాట్లే చేసింది. సబలెంకపై సంచలన విజయం అందుకున్న ష్నైడర్ ఓ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి.పొలాండ్ క్రీడాకారిణి మజా చ్వాలిన్స్కా కూడా తొలిసారిగా ఓ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె రష్యా క్రీడాకారిణి కాలిన్స్కాయాపై 7-6(7-3), 6-3 తేడాతో విజయం సాధించింది. ఈ సారి ఫ్రెంచ్ ఓపెన్ సంచనాలకు కేరాఫ్‌గా మారింది. సిన్నర్, జకోవిచ్ వంటి టాప్ ప్లేయర్లు ఇంటిదారిపట్టారు. కోకో గాఫ్, ఇగా స్వటెక్ ఇప్పుడు సబలెంక ఆట కూడా ముగిసింది. వీరి నిష్ర్కమణతో ఈ ఎడిషన్‌లో పురుషుల, మహిళల సింగిల్స్‌కు కొత్త చాంపియన్స్ రానున్నారు.
క్వార్టర్స్‌లో బాలాజీ జోడీ ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత టెన్నిస్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ ఆశలు గల్లంతయ్యాయి. పురుషుల డబుల్స్‌లో బాలాజీ బ్రెజిల్‌కు చెందిన డెమోలినర్‌తో కలిసి టోర్నీలో పాల్గొనగా.. ఈ జోడీ క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయింది. వరల్డ్ నం.3 హెన్రీ పాటెన్(ఇంగ్లాండ్)-హెలియోవారా(ఫిన్లాండ్) జోడీ చేతిలో 6-3, 6-4 తేడాతో పరాజయం పాలై ఇంటిదారిపట్టారు.






