సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులోకి వరల్డ్ కప్‌ హీరో.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

by Disha Web Desk 2 |
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులోకి వరల్డ్ కప్‌ హీరో.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ వేదికగా ఐపీఎల్ మినీ వేలం జరుగుతోంది. ఆటగాళ్ల కోసం జట్లు పోటీ పడి మరీ వేలం వేస్తున్నారు. తాజాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కీలక క్రికెటర్‌కు గాలం వేసింది. వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణమైన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్‌ ట్రావిస్ హెడ్‌ను దక్కించుకుంది. రూ.6.80 కోట్లకు ఈ వేలంలో హెడ్ అమ్ముడయ్యాడు. అయితే, ఇతని కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి వరకు ప్రయత్నం చేసినా.. SRH యాజమాన్యం ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా కొనుగోలు చేసింది. కాగా, గత వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లోనూ హెడ్ టీమిండియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.



Next Story