- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
World Cup 2025: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. నేవి ముంబైలో ప్రారంభం అయిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ (ODI World Cup)లో భాగంగా ఈ రోజు ఆస్ట్రేలియా, భారత్ (Australia, India) జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. నేవి ముంబైలో ప్రారంభం అయిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బౌలింగ్ చేయనుంది. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్ కావడంతో భారత జట్టు తమ ఫైర్ గేమ్ ను ఆడేందుకు సిద్ధం అయినట్లు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Captain Harmanpreet Kaur) చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో మంచి ఫామ్ కనబరిచిన ప్రతికా రావల్ గాయం కారణంగా బయటకు వెళ్లడంతో ఆమె స్థానంలో షెఫాలి వర్మ ని జట్టులోకి తీసుకున్నారు అలాగే రిచా గోష్, క్రాంతి గౌడ్ లను జట్టులోకి తిరిగి తీసుకొగా, ఉమా, హర్లీన్ డియోల్ బయటకు వెళ్లారు.
మరోపక్క ఆస్ట్రేలియా జట్టు మాత్రం ఒక్కరిని మాత్రమే మార్చింది. వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ (World Cup semi-final match) కావడంతో ఇరు జట్లు డూ ఆర్ డై అనే విధంగా మ్యాచ్ ఆడనున్నారు. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా కొనసాగే ఈ మ్యాచులో ఎవరూ విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్తారో తెలియాలంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఒక వేళ ఈ రోజు వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే భారత జట్టుకు గట్టి షాక్ తగలనుంది. పాయింట్ల పట్టికలో బెటర్ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు నేరుగా ఫైనల్ లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. దీంతో భారత అభిమానులు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడవద్దని కోరుకుంటున్నారు.
భారత్ ప్లేయింగ్ XI: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమంజోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), దీప్తి శర్మ, రిచా ఘోష్ (w), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిస్సా హీలీ(w/c), ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినక్స్, అలనా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షట్






