- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
11వ గేమ్‌లో గుకేశ్ విజయం.. ఆధిక్యంలోకి వెళ్లిన భారత గ్రాండ్‌మాస్టర్
దిశ, స్పోర్ట్స్ : సింగపూర్‌లో జరుగుతున్న వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ దిశగా భారత యువ సంచలనం డి.గుకేశ్ కీలక అడుగు వేశాడు. కీలకమైన 11వ గేమ్‌లో విజయం సాధించాడు. దీంతో డ్రాల పర్వానికి తెరదించాడు. ఈ గేమ్ కంటే ముందు వరుసగా 7 గేములు డ్రా అయ్యాయి. ఆదివారం జరిగిన 11వ గేమ్‌లో గుకేశ్.. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌కు షాకిచ్చాడు. తెల్లపావులతో ఆడిన అతను 29 ఎత్తుల్లో విజయం సాధించాడు. గుకేశ్ మొదటి నుంచి అద్భుతమైన ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో డింగ్ లిరెన్ రెండు పెద్ద తప్పులు చేయడంతో గుకేశ్ విజయం తేలికైంది. గుకేశ్ ఆరంభం నుంచి ప్రత్యర్థి ఊహించని ఎత్తులు వేశాడు. దీంతో 4వ ఎత్తు తర్వాత డింగ్ లిరెన్ 38 నిమిషాలు, 5వ ఎత్తు తర్వాత 22 నిమిషాలు తీసుకున్నాడు. ఐదు ఎత్తులు అయ్యే సరికి అతని గంట సమయం గడిచిపోగా.. గుకేశ్ కేవలం 32 సెకన్లే ఉపయోగించుకున్నాడు.
అయితే, 11వ కదలిక వద్ద గేమ్ మలుపు తిరిగింది. 11వ ఎత్తు కోసం గుకేశ్ గంటా 17 సెకన్ల సమయం తీసుకున్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఒక కదలిక కోసం తీసుకున్న సుదీర్ఘ సమయం ఇదే. అయితే, గేమ్ కొనసాగుతున్న కొద్ది ఒత్తిడిలో డింగ్ లిరెన్ తప్పుల మీద తప్పులు చేశాడు. ముఖ్యంగా 26వ, 28వ కదలికల వద్ద దిద్దుకోలేని తప్పు చేయడంతో గేమ్‌పై గుకేశ్‌కు పట్టు చిక్కింది. ఈ విజయంతో గుకేశ్ 6-5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. 14 గేముల టోర్నీలో మూడో గేములు మాత్రమే మిగిలి ఉన్నాయి. గుకేశ్ ఇంకా 1.5 పాయింట్లు సాధిస్తే విజేతగా నిలుస్తాడు. ఆఖరి మూడు గేములను డ్రా చేసుకున్నా అతను గెలుస్తాడు. కాబట్టి, అతనికి చివరి మూడు గేములు కీలకం కానున్నాయి.