Chess : నాలుగో గేమ్‌లో గుకేశ్‌కు డ్రా

by Harish |
Chess : నాలుగో గేమ్‌లో గుకేశ్‌కు డ్రా
X

దిశ, స్పోర్ట్స్ : సింగపూర్ వేదికగా భారత గ్రాండ్‌మాస్టర్ డి.గుకేశ్, డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్(చైనా) మధ్య వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ ఆసక్తికరంగా సాగుతోంది. శుక్రవారం జరిగిన నాలుగో గేమ్‌ను డింగ్ లిరెన్‌తో గుకేశ్ డ్రా చేసుకున్నాడు. తొలి గేమ్ కోల్పోయిన తర్వాత గుకేశ్ అద్భుతంగా పుంజుకున్నాడు. రెండో గేమ్‌ను డ్రా చేసుకున్న అతను మూడో గేమ్‌ను నెగ్గిన విషయం తెలిసిందే. నాలుగో గేమ్‌లో కూడా డిఫెండింగ్ చాంపియన్‌కు గట్టి పోటీనిచ్చాడు. నల్ల పావులతో ఆడిన గుకేశ్ ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేశాడు.అదే సమయంలో డింగ్ లిరెన్ కూడా ఏం తగ్గలేదు. దీంతో ఆసక్తికరంగా సాగిన గేమ్‌లో చివరికి 42 ఎత్తుల్లో ఇద్దరు డ్రాకు అంగీకరించారు. టోర్నీలో ఇది రెండో డ్రా. నాలుగు గేములు ముగిసే సరికి గుకేశ్, డింగ్ లిరెన్ 2-2తో సమంగా నిలిచారు. 14 గేములపాటు జరిగే టోర్నీలో 7.5 పాయింట్స్ నెగ్గిన మొదటి ప్లేయర్ టైటిల్ గెలుస్తాడు.

Advertisement

Next Story

Most Viewed