- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో డ్రాల పర్వం.. వరుసగా 7వ గేమ్ డ్రా
దిశ, స్పోర్ట్స్ : భారత చెస్ సంచలనం డి.గుకేశ్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన మధ్య వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ ఆసక్తికరంగా సాగుతోంది.సింగపూర్‌లో జరుగుతున్న టోర్నీలో డ్రాల పర్వం కొనసాగుతోంది. వరుసగా 7వ గేమ్, మొత్తంగా 8వ గేమ్ డ్రా అయ్యింది. శనివారం జరిగిన 10వ గేమ్‌లో కూడా గుకేశ్, డింగ్ లిరెన్ పాయింట్ పంచుకున్నారు. 36 ఎత్తుల తర్వాత ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. లండన్ సిస్టమ్‌తో ఆరంభించిన డింగ్ లిరెన్ మొదట్లో ఆధిపత్యం ప్రదర్శించాడు. 10వ కదలిక కోసం గుకేశ్ 22 నిమిషాలు తీసుకున్నాడు. అయితే, ఆ కదలికతో డింగ్ లిరెన్‌ను ఆలోచనలో పడేశాడు. దీంతో అతను తర్వాత కదలిక కోసం 25 నిమిషాలు తీసుకున్నాడు. ఇద్దరూ డ్రా దిశగానే కదలికలు చేయడంతో గేమ్ పెద్దగా ఆసక్తికరంగా సాగలేదు. 10 గేములు ముగిసే సరికి ఇద్దరు 5-5 పాయింట్లతో సమవుజ్జీలుగా కొనసాగుతున్నారు. గుకేశ్, డింగ్ లిరెన్ విజయానికి 2.5 పాయింట్ల దూరంలో ఉన్నారు. 14 గేముల టోర్నీలో ఇంకా 4 గేమ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.