బిజినెస్ చాట్‌లకు ఇక AI పవర్: గ్లోబల్ మార్కెట్లోకి ‘మెటా AI బిజినెస్ ఏజెంట్’!

by Naga Rani Yarlagadda |

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజమైన మెటా యాజమాన్యం తన యూజర్లకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు సిద్ధమైంది.

బిజినెస్ చాట్‌లకు ఇక AI పవర్: గ్లోబల్ మార్కెట్లోకి ‘మెటా AI బిజినెస్ ఏజెంట్’!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజమైన మెటా యాజమాన్యం తన యూజర్లకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు సిద్ధమైంది. తన ఏఐ బిజినెస్ ఏజెంట్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. లండన్ లో జరిగిన కంపెనీ కన్వర్జేషన్స్ ఈవెంట్లో ఈ ప్రకటన చేసింది. ఇకపై వ్యాపార సంస్థలు తమ కస్టమర్లతో చేసే బిజినెస్ చాట్ లకు వాట్సాప్, మెసేంజర్, ఇన్ స్టాగ్రామ్ లను వేదికలుగా మార్చనుంది. అందుకోసమే ఈ టూల్ ను ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పెట్టనున్నట్లు వెల్లడించింది. వినియోగదారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వ్యాపార సంస్థల క్యాటలాగ్ నుంచి ప్రొడక్ట్స్ ను రికమండ్ చేయడం, అపాయింట్మెంట్లను బుక్ చేయడం, సేల్స్ లీడ్స్ సేకరించడం వంటి కస్టమర్ ఫేసింగ్ టాస్కులన్నింటినీ ఈ బిజినెస్ ఏజెంట్ ఆటోమెటిక్ గా పూర్తి చేస్తుంది. ఇక్కడ మరో ఆప్షన్ కూడా ఉంది. కస్టమర్ చాటింగ్ ను ఏ సమయంలో ఏఐ ఏజెంట్ నుంచి హ్యూమన్ రిప్రజెంటేటివ్ కు బదిలీ చేయాలో వ్యాపార సంస్థలే నిర్ణయించుకోవచ్చు.

వాట్సాప్, మెసేంజర్లలో దాదాపు 10 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు ఏఐ టూల్ ను వాడుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల చిన్న, పెద్ద వ్యాపారాలకు దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని మెటా వివరించింది. ప్రస్తుతం ఈ బిజినెస్ ఏజెంట్ సేవల్ని ఫ్రీ గానే అందిస్తున్నప్పటికీ.. మున్ముందు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకురావాలని మెటా భావిస్తోంది.

కస్టమర్లకోసం కొత్త ఫీచర్లు

వ్యాపారాల విస్తరణతో పాటు వాట్సాప్‌లో కొత్త ఫీచర్లను కూడా మెటా ప్రకటించింది. దీని ద్వారా యూజర్లు ఏఐ ఏజెంట్లను ఉపయోగించే బిజినెస్‌లను సెర్చ్ అండ్ కాంటాక్ట్ షేరింగ్ ఫంక్షన్ల ద్వారా సులభంగా కనుగొనవచ్చు. అలాగే వ్యాపార సంస్థల కోసం మిస్డ్ చాట్ సమ్మరీలు, కస్టమర్ ఇంటరాక్షన్ అప్‌డేట్స్, కాన్వర్జేషన్ ఇన్‌సైట్స్ వంటి కొత్త ఆప్షన్లను తీసుకొచ్చారు. ప్రారంభంలో వాట్సాప్ బిజినెస్ యాప్, ఇన్‌స్టాగ్రామ్ ప్రో, మెసేంజర్, మెటా బిజినెస్ సూట్ ఉపయోగించే పరిమిత సంఖ్యలో ఉన్న వ్యాపారాలకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

Next Story