- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
World Chess Championship 2024 : 13వ గేమ్ డ్రా.. వరల్డ్ చెస్ చాంపియన్ షిప్
by Sathputhe Rajesh |

X
దిశ, స్పోర్ట్స్ : సింగపూర్‌లో జరుగుతున్న వరల్డ్ చెస్ చాంపియన్ షిప్‌లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. గుకేష్, డింగ్ లిరెన్ మధ్య 13వ గేమ్ సైతం బుధవారం డ్రాగా ముగిసింది. దీంతో ఇద్దరు ఆటగాళ్లు 6.5-6.5 పాయింట్లతో స్కోర్ సమం చేశారు. 69 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. తుది ఫలితాన్ని నిర్ణయించే చివరి గేమ్ గురువారం జరగనుంది. 14వ రౌండ్ సైతం డ్రాగా ముగిస్తే ఇద్దరికి 7-7 పాయింట్లు దక్కనున్నాయి. అదే జరిగితే శుక్రవారం జరిగే టై బ్రేక్‌లో విజేతను నిర్ణయించనున్నారు. డింగ్ చివరి గేమ్‌లో తెల్ల పావులతో ఆడనున్నాడు. గతేడాది డింగ్ ఇదే తరహాలో చివరి రౌండ్‌లో రష్యా ఆటగాడు ఇయాన్ నెపోన్యాచిని ఓడించాడు.
Next Story