- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరల్డ్ టైటిల్ కాపాడుకోలేకపోయిన నీరజ్.. కనీసం పతకం కూడా లేకుండానే ఇంటికి
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్ ఒలింపిక్స్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా వరల్డ్ టైటిల్‌ను కాపాడులేకపోయాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్ ఒలింపిక్స్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా వరల్డ్ టైటిల్‌ను కాపాడులేకపోయాడు. టోక్యోలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అతను దారుణంగా నిరాశపరిచాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నీరజ్ వరల్డ్ చాంపియన్‌గా నిలవడం అటు ఉంచితే కనీసం పతకం గెలవకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2022లో రజతం గెలిచిన నీరజ్.. గత ఎడిషన్ 2023లో వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు.
క్వాలిఫికేషన్ రౌండ్‌లో సత్తాచాటిన అతను గురువారం జరిగిన ఫైనల్‌లో మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయాడు. 7వ స్థానంతో సరిపెట్టడం గమనార్హం. అతని బెస్ట్ త్రో 84.03 మీటర్లే. ఈ ఏడాది దోహా డైమండ్ లీగ్‌లో 90.23 మీటర్లు త్రో చేసిన విషయం తెలిసిందే. ఏడేళ్లలో అంతర్జాతీయ ఈవెంట్‌లలో నీరజ్ పతకం గెలకపోవడం ఇదే తొలిసారి. అయితే, మరో భారత అథ్లెట్ సచిన్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన పర్సనల్ బెస్ట్ నమోదు చేసిన అతను తృటిలో పతకాన్ని కోల్పోయాడు. 86.27 మీటర్ల త్రోతో నాలుగో స్థానంలో నిలిచాడు. కాంస్య పతకానికి అతను కేవలం 40 సెంటిమీటర్ల దూరంలో ఆగిపోయాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన వాల్‌కాంట్(88.16 మీ) స్వర్ణం దక్కించుకున్నాడు. గ్రెనడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్(87.38 మీటర్లు), అమెరికా అథ్లెట్ కర్టిస్ థామ్సన్(86.67 మీ) వరుసగా రజతం, కాంస్యం సాధించారు. పాక్ అథ్లెట్, పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ అర్షద్ నదీమ్(82.75 మీ) కనీసం ప్రభావం చూపలేకపోయాడు. 12 మంది పాల్గొన్న పోటీలో అతను 10వ స్థానంలో నిలిచాడు.






