- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన వరల్డ్ చాంపియన్ గుకేశ్
భారత గ్రాండ్‌మాస్టర్, వరల్డ్ చాంపియన్ డి.గుకేశ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత గ్రాండ్‌మాస్టర్, వరల్డ్ చాంపియన్ డి.గుకేశ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్(ఫైడ్) శనివారం రిలీజ్ చేసిన క్లాసిక్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నం.3 ర్యాంక్‌కు చేరుకున్నాడు. గుకేశ్ 3వ స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. 10 పాయింట్స్ మెరుగుపర్చుకున్న అతను 2787 రేటింగ్ పాయింట్లతో నిలిచాడు. ఇటీవల టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నీలో గుకేశ్ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తెలుగు కుర్రాడు అర్జున్ ఇరిగేశి 5వ స్థానంలో ఉన్నాడు. మరో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద తిరిగి టాప్-10లోకి ప్రవేశించాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్ నెగ్గిన అతను 17 పాయింట్స్ ఎగబాకి 8వ స్థానానికి చేరుకున్నాడు. నార్వే స్టార్ మాగ్నస్ కార్ల్‌సన్(2833) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల ర్యాంకింగ్స్‌లో 5 పాయింట్లు మెరుగుపర్చుకున్న కోనేరు హంపి 6వ స్థానంలో ఉంది. ఆర్.వైశాలి, ద్రోణవల్లి హారిక 14, 16 ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు.






