- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిఖత్‌కు షాక్.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఓటమి
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్ హోదాను కాపాడుకోలేకపోయింది.

దిశ, స్పోర్ట్స్ : తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్ హోదాను కాపాడుకోలేకపోయింది. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌లోనే ఇంటిదారిపట్టింది. 51 కేజీల కేటగిరీలో పోటీ పడిన ఆమె క్వార్టర్ ఫైనల్‌లో తుర్కియేకు చెందిన కాకిరోగ్లు బుసె నాజ్ చేతిలో 5-0 తేడాతో పరాజయం పాలైంది. మూడు రౌండ్లలోనూ ప్రత్యర్థిని నిఖత్ నిలువరించలేకపోయింది. వరుసగా 2022, 2023లలో వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ కనీసం కాంస్య పతకం కూడా సాధించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరోవైపు, భారత బాక్సర్లు నుపూర్ షెయోరాన్(80+ కేజీలు), జైస్మిన్(57 కేజీలు) పతకం ఖాయం చేసుకున్నారు. తమ విభాగాల్లో వీరు సెమీస్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్‌లో నుపూర్ 4-1 తేడాతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఒల్టినోయ్ సోటింబోవాపై గెలుపొందింది. జైస్మిన్ 5-0 తేడాతో ఉజ్బెకిస్తాన్‌కే చెందిన మామాజొనోవా ఖుమోరాబోనుపై విజయం సాధించింది.






