- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైస్ కెప్టెన్సీ పోయినా మారవా..! పంత్‌కు గంభీర్ సీరియస్ వార్నింగ్
అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్ట్‌కు ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: అఫ్గానిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టులో అంతర్గత పరిణామాలు వేడెక్కాయి. ఇటీవల భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్సీ పదవిని కోల్పోయిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు (Rishabh Pant) టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పంత్ తన సహజసిద్ధమైన దూకుడు ఆటతీరును మార్చుకోవాల్సిన అవసరం లేదని, కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలంటే కచ్చితంగా మ్యాచ్ పరిస్థితులను చూసి ఆడటం నేర్చుకోవాలని స్పష్టం చేశారు. న్యూ చండీగఢ్‌లో శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ ఈ కామెంట్ చేశారు.
కాగా, కొంతకాలంగా రిషభ్ పంత్ ఫామ్, అతడు అవుట్ అవుతున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అనవసరపు షాట్లు ఆడి వికెట్ పారేసుకోవడంపై గంభీర్ అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. బ్యాట్స్‌మెన్ ఎప్పుడు డిఫెన్స్ చేయాలో, ఎప్పుడు అటాక్ చేయాలో విచక్షణతో ఆడాలని క్లాస్ పీకారు. ఇక కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే కూడా రిషభ్ పంత్ తన ఆటలో తొందరపాటును తగ్గించుకుని పరిస్థితులకు అనుగుణంగా ఆడటంపై వర్కవుట్ చేస్తున్నాడని తెలిపారు.






