- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెస్టుల్లోకి శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో రాలేడు : ఆకాశ్ చోప్రా
భారత్ టెస్టు జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది.

దిశ, స్పోర్ట్స్ : భారత్ టెస్టు జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న అతన్ని ఇంగ్లాండ్ టూరుకు ఎంపిక చేయాల్సిందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. శ్రేయస్ అయ్యర్‌కు ఇప్పట్లో చోటు దక్కదన్నాడు. కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లు అతని కంటే ముందు వరుసలో ఉన్నాయని చెప్పాడు.
‘శ్రేయస్ అయ్యర్‌కు ఇప్పుడు అవకాశం రాదు. అతనికే కాదు చాలా మందికి అవకాశం రాలేదు. కరుణ్ నాయర్‌కు 8ఏళ్ల తర్వాత చోటు దక్కింది. సర్ఫరాజ్ ఖాన్‌కు చాన్స్ ఇవ్వలేదు. ధ్రువ్ జురెల్ బెంచ్‌పైనే ఎదురుచూస్తున్నాడు. ఎదురుచూస్తున్న ఆటగాళ్ల జాబితాలోనే లేకపోతే అతన్ని సెలెక్షన్‌కు ఎలా పరిగణిస్తారు.’అని తెలిపాడు. అయ్యర్‌కు అద్భుతమైన ఫస్ట్ క్లాస్ సీజన్‌ను కలిగి ఉన్నాడని, వైట్ ఫార్మాట్లలోనూ సత్తాచాటడని చెప్పాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడని తెలిపాడు. కానీ, టెస్టుల్లోకి రావడానికి అతనికీ సమయం వస్తుందని, అప్పటివరకు అతని ఎదురుచూడాల్సిందేనని చెప్పుకొచ్చాడు.
కొంతకాలంగా అయ్యర్ అన్ని ఫార్మాట్లోనూ రాణిస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో అతనిదే కీలక పాత్ర. టోర్నీలో 243 రన్స్ చేసి టీమిండియా తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రంజీ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లోనే 480 రన్స్ చేశాడు. అలాగే, ఐపీఎల్‌లో 604 పరుగులు చేసిన అతను కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్‌ను 9ఏళ్లతర్వాత ఫైనలకు చేర్చాడు. అయ్యర్ గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌పై చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.






