- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమెన్స్ వరల్డ్ కప్: మళ్లీ వాయిదా పడ్డ టాస్
ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ ఉత్కంఠభరిత దశలోకి చేరిన వేళ.. వాతావరణం మాత్రం కీలక మ్యాచుకు అడ్డు తగులుతుంది.

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ వరల్డ్ కప్ (Women's World Cup) క్రికెట్ టోర్నీ ఉత్కంఠభరిత దశలోకి చేరిన వేళ.. వాతావరణం మాత్రం కీలక మ్యాచుకు అడ్డు తగులుతుంది. భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య నేవి ముంబై వేదికగా జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌కు ముందుగా జరగాల్సిన టాస్ వర్షం కారణంగా మరోసారి వాయిదా పడింది. గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని ఆరబెట్టే ప్రయత్నాలు చేస్తుండగా, ఆటగాళ్లు డ్రెస్సింగ్‌రూమ్‌లలోనే వేచిచూస్తున్నారు. మొదట కొద్ది సేపు వర్షం పడి ఆగింది. దీంతో కవర్స్ తీసేసిన సిబ్బంది.. పిచ్ ను రెడి చేస్తుండా.. అంపైర్లు టాస్ చేయడానికి సన్నాహాలు చేశారు. ఈ క్రమంలో ఊహించిన విధంగా మరోసారి వర్షం పడింది.
దీంతో మళ్లీ టాస్ వాయిదా పడింది. ప్రస్తుతం గ్రౌండ్ మొత్తం కవర్స్ కప్పబడ్డాయి. అయితే ఫైనల్ మ్యాచ్ కావడంతో ఆలస్యం అయినా పూర్తి మ్యాచ్ ను నిర్వహించేందుకు అంపైర్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాతావరణం ఏ విధంగా సహకరిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి నేలకొంది. నేడు జరిగే ఈ ఫైనల్ మ్యాచులో ఏ జట్టు గెలిచినా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ కు కొత్త ఛాంపియన్ గా నిలవనున్నారు. మరీ ఈ ఉత్కంఠ మ్యాచులో ఎవరు గెలుస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
భారత మహిళా జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), దీప్తి శర్మ, రిచా ఘోష్(w), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ రాణా
దక్షిణాఫ్రికా మహిళా జట్టు: లారా వోల్వార్డ్ట్(సి), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా(w), అన్నరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, నోంకులులేకో మ్లాబా, మసాబాటా క్లాస్, మసాబాటా క్లాస్, కరాబో మెసో






