- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
5న భారత్, పాక్ మ్యాచ్.. సూర్య సేనను ఫాలోకానున్న భారత మహిళల జట్టు
by Harish |
ఆసియా కప్‌లో భారత ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

X
దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో భారత ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆసియా కప్ గెలిచిన తర్వాత మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా నిరాకరించారు. దీంతో పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామనే సందేశాన్ని ఇచ్చింది సూర్య సేన. ఇదే విధానాన్ని భారత మహిళల క్రికెట్ జట్టు కూడా అనుసరించనుంది. మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లతో భారత మహిళా క్రికెటర్లు కరచాలనం చేయరని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.‘టాస్ సమయంలో హ్యాండ్‌షేక్ ఉండదు. మ్యాచ్ రిఫరీతో ఫొటో షూట్ లేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కరచాలనం లేదు. పురుషుల జట్టు అనుసరించిన విధానాన్నే మహిళల జట్టు కూడా ఫాలో అవుతుంది.’అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Next Story






