- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆ రూల్‌ను ఉల్లంఘించిన భారత్.. జరిమానా విధించిన ఐసీసీ
by Harish |
మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పరాజయం పాలైన విషయం తెలిసిందే.

X
దిశ, స్పోర్ట్స్ : మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పరాజయం పాలైన విషయం తెలిసిందే. 331 పరుగుల భారీ టార్గెట్ పెట్టినప్పటికీ ఓటమి తప్పలేదు. ఆ పరాజయం నుంచి ఇంకా తేరుకోకముందే భారత జట్టుకు ఐసీసీ మరో షాకిచ్చింది. ఆ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను ఉల్లంఘించినందుకు జరిమానా విధించింది. భారత్ నిర్ణీత సమయంలో ఒక్క ఓవర్ తక్కువగా వేసింది. దీంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. భారత్ మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత పడింది. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేరాన్ని అంగీకరించింది. ప్రపంచకప్‌లో వరుసగా రెండు విజయాలతో దూకుడు కనబర్చిన భారత్ ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయింది. ఈ నెల 19న జరిగే తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో ఆడనుంది.
Next Story






