Women World Cup : మహిళలు ప్రపంచ కప్ 2025 వేదికలు ఖరారు

by Muthe.Rajitha |

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025(Women's ODI World Cup 2025) వేదికలు ఖరారు అయ్యాయి.

Women World Cup : మహిళలు ప్రపంచ కప్ 2025 వేదికలు ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళల వన్డే ప్రపంచ కప్ 2025(Women's ODI World Cup 2025) వేదికలు ఖరారు అయ్యాయి. సెప్టెంబరు 30 నుంచి నవంబర్ 2 వరకు భారతదేశం(India), శ్రీలంక(Srilanka)లోని వేదికల్లో ఈ మ్యాచులు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు పాల్గొంటాయి. హైబ్రిడ్ ఫార్మాట్‌లో మూడు వారాల పాటు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు, సెమీ-ఫైనల్స్, ఫైనల్‌ సహా నిర్వహించబడతాయి. భారత్ లో విశాఖపట్నం ఓపెనింగ్ మ్యాచ్‌కు ప్రధాన వేదికగా ఉండగా.. తిరువనంతపురంలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

అలాగే ఇండోర్‌, గౌహతి, బెంగళూరుతోసహ శ్రీలంకలోని కొలంబోలో మ్యాచులు జరగనున్నట్టు ICC పేర్కొంది. అక్టోబర్ 29న కొలంబోలో సెమీ ఫైనల్, 30న బెంగుళూరులో సెమీ ఫైనల్, నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ కూడా అక్కడే జరగనుంది. అయితే ఈ టోర్నీలో పాక్ ఫైనల్ చేరితే ఫైనల్ మ్యాచ్ కొలంబోలో నిర్వహించనున్నారు.

Next Story