- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రోఫీలు గెలవడమే ముఖ్యమని అప్పుడే అర్థమైంది : రోహిత్ శర్మ
పరుగులు చేయడం కంటే జట్టు గెలవడం, ట్రోఫీలు దక్కించుకోవడం ముఖ్యమని తెలుసుకున్నానని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

దిశ, స్పోర్ట్స్ : పరుగులు చేయడం కంటే జట్టు గెలవడం, ట్రోఫీలు దక్కించుకోవడం ముఖ్యమని తెలుసుకున్నానని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రోహిత్ చాంపియన్స్ ట్రోఫీ విజయం గురించి, ఆటపై తన ఆలోచనా విధానాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు సమిష్టి కృషి ముఖ్యని చెప్పిన రోహిత్ 2019 వరల్డ్ కప్‌ను ప్రస్తావించాడు. ‘2019 వరల్డ్ కప్‌లో నేను ఐదు సెంచరీలు చేశాను. కానీ, మేము సెమీస్‌లో ఓడిపోయాం. తర్వాతి రోజు నేను విమానంలో వస్తుండగా ఓ విషయం అర్థమైంది. ఈ పరుగులు అన్నీ వృథా. సమిష్టిగా ఆడకపోతే ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకున్నా. అప్పటి నుంచి నా మైండ్‌సెట్ మారిపోయింది. గేములు గెలవడం, టోర్నమెంట్‌లు గెలవడం, చాంపియన్‌షిప్ గెలవడంపైనే ఫోకస్ పెట్టా.’ అని రోహిత్ తెలిపాడు.
చాంపియన్స్ ట్రోఫీ విజయం గురించి మాట్లాడుతూ..‘టోర్నీ ప్రారంభానికి ముందు మేము చాలా ఓటములను చూశాం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లను కోల్పోయాం. కాబట్టి, మేము తిరిగి పుంజుకోవాలనుకున్నాం. జట్టులోని ప్రతి ప్లేయర్‌కు ఏం చేయాలి, ఏం సాధించాలి అనే దానిపై స్పష్టత ఉంది. సెలక్షన్‌లో కూడా మేము మార్పులు చేయలేదు. వన్డే వరల్డ్ కప్‌లో బాగా ఆడాం. కాబట్టి, ఎవరిని తప్పించాలని అనుకోలేదు. మేము ఒకరు లేదా ఇద్దరిపై ఆధారపడాలని అనుకోలేదు. ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు.’ అని చెప్పుకొచ్చాడు.
- Tags
- Rohit Sharma






