- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Wimbledon: టైటిల్ వేట మొదలుపెట్టిన స్పిన్నర్.. తొలి రౌండ్‌లో అలవోకగా..
వింబుల్డన్‌లో టైటిల్ ఫేవరెట్, వరల్డ్ నం.1 ఆటగాడు జెన్నిక్ సిన్నర్ శుభారంభం చేశాడు.

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో టైటిల్ ఫేవరెట్, వరల్డ్ నం.1 ఆటగాడు జెన్నిక్ సిన్నర్ శుభారంభం చేశాడు. ఈ ఇటలీ ప్లేయర్ సహచరుడు ల్యూక్ నర్డిని ఓడించాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సిన్నర్ 6-4, 6-3,6-0తేడాతో నర్డిపై ఏకపక్ష విజయం సాధించాడు. 9 ఏస్‌లు, 28 విన్నర్లు కొట్టిన సిన్నర్ గంటా 48 నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ క్రెజికోవా(చెక్ రిపబ్లిక్) కూడా శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో క్రెజికోవా 3-6, 6-2, 6-1 తేడాతో ఫిలిప్పీన్స్‌కు చెందిన అలెగ్జాండ్రా ఈలాను ఓడించింది. తొలి సెట్‌లో క్రెజికోవాకు నిరాశ ఎదురువ్వగా.. ఆ తర్వాత బలంగా పుంజుకుని మిగతా రెండు సెట్లలో నెగ్గింది. మరో టైటిల్ ఫేవరెట్ ఇగా స్వైటెక్(పొలాండ్) సైతం టోర్నీని విజయంతో ఆరంభించింది. తొలి రౌండ్‌లో కుడెర్మెటోవా(రష్యా)ను 5-7, 1-6 తేడాతో ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది.
స్టార్లు నిష్ర్కమణ
వింబుల్డన్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. పురుషుల సింగిల్స్ వరల్డ్ నం.3 ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టాడు. అతనికి 6-7(3-7), 7-6(10-8), 3-6, 7-6(7-5), 4-6 తేడాతో ఫ్రాన్స్ ఆటగాడు ఆర్థర్ రిండెర్క్నెచ్ షాకిచ్చాడు. 4 గంటల 40 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పోరులో జ్వెరెవ్ తీవ్రంగా పోరాడినప్పటికీ ఐదో సెట్‌లో ఓటమిని అంగీకరించక తప్పలేదు. ఉమెన్స్ సింగిల్స్‌లో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ క్వెన్వెన్ జెంగ్ 5-7, 6-4, 1-6 తేడాతో సినియాకోవా(చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడి తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది. అలాగే, వరల్డ్ నం.3 క్రీడాకారిణి జెస్సికా పెగులా(అమెరికా)కు కూడా నిరాశే ఎదురైంది. తొలి రౌండ్‌లో ఇటలీకి చెందిన కొకియారెట్టో చేతిలో 6-2, 6-3 తేడాతో పరాజయం పాలైంది.






