- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎదురులేని జకోవిచ్.. వింబుల్డన్‌లో క్వార్టర్స్‌లో అడుగు
వింబుల్డన్‌లో దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ హవా కొనసాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో మెన్స్ సింగిల్స్ టైటిల్ ఫేరెట్, దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్(సెర్బియా)కు ఎదురులేకుండా పోయింది. వరుసగా విజయాలతో జోరు మీద ఉన్న అతను క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌లో జకో ఆస్ట్రేలియా ప్లేయర్ అలెక్స్ డె మినార్‌ను చిత్తు చేసి ముందంజ వేశాడు. 3 గంటల 19 నిమిషాలపాటు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో జకో 1-6, 6-4, 6-4, 6-4 తేడాతో విజయం సాధించాడు. మ్యాచ్‌లో మొదట అతనికి షాకే తగిలింది. తొలి సెట్‌లో పేలవ ప్రదర్శన చేసిన ఆ సెట్‌ను కోల్పోయాడు. కానీ, తర్వాత బలంగా పుంజుకున్న జకో వరుసగా మూడు సెట్లలో గెలిచాడు. ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనప్పటికీ జకో తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ పైచేయి సాధించాడు. మరో టైటిల్ ఫేవరెట్, డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ కూడా టైటిల్ నిలబెట్టుకునే దిశగా సాగుతున్నాడు. నాలుగో రౌండ్‌లో అతను అలెగ్జాండర్ రుబ్లెవ్‌ను నిలువరించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం అర్ధరాత్రి హోరాహోరీగా సాగిన పోరులో 6-7(5-7), 6-3, 6-4, 6-4 తేడాతో రుబ్లెవ్‌పై అల్కరాజ్ విజయం సాధించాడు. అల్కరాజ్ ఏస్‌లు, విన్నర్లు బాది ఆధిపత్యం చెలాయించాడు. రుబ్లెవ్ 6 ఏస్‌లు, 29 విన్నర్లు కొట్టగా.. అల్కరాజ్ 22 ఏస్‌లు, 41 విన్నర్లు బాదాడు.
ప్రీక్వార్టర్స్‌లో బాంబ్రీ జోడీ ఓటమి
వింబుల్డన్‌లో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ-రాబర్ట్ గాల్లోవే(అమెరికా) జోడీ పోరాటం ముగిసింది. ప్రీక్వార్టర్స్‌లో గ్రానోల్లెర్స్(స్పెయిన్)-జెబల్లోస్(అర్జెంటీనా) జంట చేతిలో 6-4, 3-6, 7-6(10-4) తేడాతో పరాజయం పాలైంది. 2 గంటలకుపైగా హోరీహోరీగా సాగిన మ్యాచ్‌లో బాంబ్రీ ద్వయం పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. తొలి రెండు సెట్లలో చెరో సెట్ గెలవగా నిర్ణయాత్మక మూడో సెట్‌లో బాంబ్రీ, గాల్లోవ్ టై బ్రేకర్‌లో మ్యాచ్‌ను కోల్పోయారు.






