వింబుల్డన్‌లో అల్కరాజ్ హవా.. ప్రీక్వార్టర్స్‌కు క్వాలిఫై

by Harish |

ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా సాగుతున్నాడు.

వింబుల్డన్‌లో అల్కరాజ్ హవా.. ప్రీక్వార్టర్స్‌కు క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్‌లో డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా సాగుతున్నాడు. టోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో అల్కరాజ్ 6-1, 3-6, 6-3, 6-4 తేడాతో జర్మనీ ప్లేయర్ జాన్ లెనార్డ్ స్ట్రఫ్‌ను చిత్తు చేశాడు. టోర్నీలో పోరాటాన్నే నమ్ముకున్న అల్కరాజ్ ఈ మ్యాచ్‌లోనూ అతనికి ప్రత్యర్థి నుంచి కాస్త పోటీతప్పలేదు. తొలి సెట్ నెగ్గి శుభారంభం చేసినా రెండో సెట్‌ ప్రత్యర్థి నెగ్గడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే, మిగతా రెండు సెట్లలో అల్కరాజే పైచేయి సాధించాడు. అయితే, నాలుగో సెట్‌లో ఒక దశలో 4-3తో వెనుకబడిన స్థితి నుంచి పుంజుకున్నాడు. వరుసగా మూడు గేముల్లో గెలిచి మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు. మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ నవోమి ఒసాకా(జపాన్) మూడో రౌండ్‌లోనే నిష్ర్కమించింది. ఆమెకు 6-3, 4-6, 4-6 తేడాతో రష్యా క్రీడాకారిణి పావ్లియుచెంకోవా షాకిచ్చింది.

Next Story